కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో అంతా మాఫియా రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ఆదివారం రాజేంద్రనగర్ లో బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సినిమా సగం అయిపోయిందని చెప్పారు. రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సినిమాలో మొత్తం తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రం బాగుపడాలి అంటే కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని ఇప్పుడు తెలంగాణ ప్రజలు అందరూ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ కు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టించిందని.. హైదరాబాద్ లో వేళ ఇళ్లు కూల్చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడటం, కేసులు పెట్టడం తప్ప పరిపాలన చేత కాదని విమర్శలు గుప్పించారు.

