కలం, నిర్మల్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతవసంతాల సందర్భంగా ఈనెల 13న నిర్మల్ జిల్లా కేంద్రంలో యువ హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నగర సంఘ్ చాలక్ డాక్టర్ తుమ్మల ప్రమోద్ చంద్ర రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక భవానీనగర్లో డిమార్ట్ ఎదురుగా ఉన్న ఎంకే కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 5:30 గంటలకు సమ్మేళనం ప్రారంభమవుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన్ కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. హిందూ యువత పెద్ద సంఖ్యలో సమ్మేళనానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఇతర వివరాల కోసం 9966763964, 9666266893 మొబైల్ నంబర్లను సంప్రదించాలని కోరారు.

