కలం, వెబ్ డెస్క్: జూరాల ప్రాజెక్ట్ (Jurala Project) నుంచి కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు సాగునీరు వదలటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR) హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కదిలివచ్చి నీరు విడుదల చేసేందుకు పోరాటం చేసిన రైతులకు, పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు. జూరాల ప్రాజెక్టు నుండి నీరు అందక, పొలాలు పూర్తిగా ఎండిపోతున్న తరుణంలో హక్కుల కోసం రైతులు చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
పోరాడితే పోయేదేమీలేదు.. బానిస సంకెళ్లు తప్పా! అంటూ రాసుకొచ్చారు. ఈ కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా మిగిలిన రెండేళ్లు పోరాడాలని.. అదే తమ కర్త్యవ్యం అని కేడర్ లో జోష్ నింపారు. ప్రశ్నించడం, పోరాడడం, తెలంగాణ హక్కుల కోసం అవసరం అయితే ఎవరితోనైనా పోరాడాలని.. ఇదే తమ ముందున్న లక్ష్యమని దిశానిర్దేశం చేశారు. రైతుల హక్కుల కోసం ప్రశ్నించేది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మరోసారి స్పష్టమైందని టీఆర్ ( KTR) పేర్కొన్నారు.
Also Read : ఎర్రవల్లి ల్యాండ్స్..కేసీఆర్కు బిగ్ షాక్!
Follow Us On: X(Twitter)

