త్వరలో ఎన్నికలు.. బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం!

కలం, వెబ్‌డెస్క్: త్వరలో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లా బీఆర్ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల సభ్యత్వ నమోదుపై చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో వేగవంతం చేయాలని ఆదేశించారు.

గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి వార్డులో బలమైన కమిటీని ఏర్పాటు చేయడం, కార్యకర్తలను నిరంతరం సన్నద్ధం చేయడం వంటి అంశాలపై చర్చించారు. అదే విధంగా SIR ప్రక్రియలో నాయకులు పోషించాల్సిన పాత్రపై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. SIR ప్రక్రియలో అర్హులైన వాళ్లలో ఒక్కరూ కూడా ఓటు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత నాయకులపై ఉందని గుర్తు చేశారు.

Read Also: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>