కలం, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం (RTC Bus Accident) జరిగింది. ముందు వెళ్తున్న ధాన్యం లారీని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలు కాగా, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బోధన్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు సికిందరాబాద్ నుంచి బోధన్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

