భారత పౌరులకు ప్రశ్నించే హక్కు లేదా?: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: భారత పౌరులకు ప్రశ్నించే హక్కు లేదా? అని రేవంత్ సర్కార్ ను బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్‌ (Krishank) ను ఆయన పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ఫేక్ పోస్టులు పెట్టిన వారిని వదిలేసి.. ఆధారాలతో ఫిర్యాదు చేసిన క్రిషాంక్‌ను అరెస్టు చేయడం కక్షసాధింపు చర్యనేనని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, సిట్‌లతో అణచివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు బెంగళూరు ప్రైవేట్ హ్యాకర్లను కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చోబెట్టి తమ ఫోన్లు, ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని చెప్పారు. చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్లను రేపు రిటైర్ అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వారిపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.

ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు, సిట్లు, కమిషన్లు వేస్తూ అణచివేసే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం కల్పిస్తామని చెప్పి నేడు నియంతలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకత్వంపై ఫేక్ పోస్టులు పెడుతున్న వారి గురించి పోలీసులకు ఆధారాలతో సహా ఫోన్ అప్పగించి క్రిషాంక్‌ ఫిర్యాదు చేశారని చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలేసి, కంప్లైంట్ ఇచ్చిన క్రిషాంక్‌నే అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులను జైల్లో పెడతారా? అని ప్రశ్నించారు.

ఇలా కేసులు పెట్టి మళ్లీ గెలుస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది హిట్లర్‌ను మించిన మూర్ఖత్వమేనని హరీశ్ రావు (Harish Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి రెండు బాధ్యతలూ మీ దగ్గరే పెట్టుకుని ఇలాంటి అరాచకాలకు పాల్పడతారా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. ఇదేనా మీ ప్రజాస్వామ్యం? అని మండిపడ్డారు. క్రిషాంక్‌పై నాన్ బెయిలబుల్ కేసులు ఎలా పెడతారని సాక్షాత్తూ మెజిస్ట్రేట్ పోలీసులను ప్రశ్నించారంటేనే మీ కక్షసాధింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని అన్నారు. అంగన్వాడీ ఫోన్ల కుంభకోణం, టెన్త్ పేపర్ లీక్, హెచ్‌సీయూ గచ్చిబౌలి భూములు, సోమ్ డిస్టిలరీస్ వ్యవహారం, మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ వివాదం.. ఇలా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినందుకే ఆయనపై వరుసగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>