అమరావతిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి పనులపై ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు (CM Chandrababu)  కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి అంటే కేవలం 29 గ్రామాలుగానే చూడొద్దని.. విజయవాడ, గుంటూరు కలిపితే అమరావతి రాజధాని అని స్పష్టం చేశారు. స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా రాజధాని పనులు చేయాలన్న సీఎం.. ఇకపై రాజధాని పనులను స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు.

రాజధాని పనులు సమయానికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల పనులు వేగంగా జరగాలన్నారు. రాజధాని పనులకు ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. కాబట్టి రాజధానిలో నెలకు కనీసం 7.92 శాతం పనులు జరగాలని అధికారులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>