‘ఆదర్శ కుటుంబం’ వాయిదా.. విడుదల ఎప్పుడంటే!

కలం, వెబ్ డెస్క్: విక్టరీ వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – AK 47’ (Adarsha Kutumbam AK 47) మూవీ అక్టోబర్ 9న విడుదల కాబోతుంది. ముందు అక్టోబర్ రెండో తేదీనే వస్తున్నట్లు ప్రకటించిన.. వారం రోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తుండగా.. రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన మూవీ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేశ్ పాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఎమోషన్స్, యాక్షన్ అంశాలను మేళవించారు. చాలా ఏళ్ల తరువాత త్రివిక్రమ్‌–వెంకటేశ్ కాంబోలో వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయబోతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>