Mobile Popup Ad
Mobile Popup Ad

అరుదైన సన్నివేశం.. ఒకే వేదికపై కేటీఆర్, ఈటల పలకరింపులు!

కలం, వెబ్ డెస్క్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాటను నిజం చేస్తూ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడి వివాహ వేడుకలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉంటూ, పరస్పరం విమర్శలు గుప్పించుకునే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (KTR-Etela) ఒకరికొకరు ఎదురయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి, ఇరు నేతలు ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది.

ఈ వేడుకలో కేటీఆర్ కుటుంబ సమేతంగా పాల్గొనగా, ఈటల రాజేందర్‌ను (KTR-Etela) చూడగానే మర్యాదపూర్వకంగా పలకరించారు. ముఖ్యంగా కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఎంతో వినయంగా ఈటల రాజేందర్‌కు రెండు చేతులు జోడించి నమస్కరించడం విశేషం. ఈటల కూడా హిమాన్షును అంతే ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించారు. ఈ దృశ్యం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>