Mobile Popup Ad
Mobile Popup Ad

చర్చకు నేను రెడీ.. డేట్, టైం ఫిక్స్ చేయండి.. సీఎంకు కేటీఆర్ సవాల్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో రైతు భరోసా వేదికగా తెలంగాణను బీఆర్ఎస్ అప్పులపాలు చేసిందని సీఎం రేవంత్ (CM Revanth) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలు, రైతుల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రంలో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలోని ఆయన పాల్గొని మాట్లాడారు.

“కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధం. డేట్, టైం ఫిక్స్ చేయాలి. అసెంబ్లీనా? ప్రెస్ క్లబ్లోనా? జూబ్లీహిల్స్ ప్యాలెస్ లోనా? ఎక్కడైనా నేను రెడీ. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్ చౌరస్తానా? 2 లక్షల ఉద్యోగాలు అని రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తానా?” అంటూ సీఎంకు కేటీఆర్ సవాల్ విసిరారు. నిజంగానే రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించడంలో తాను విఫలమైతే అక్కడికక్కడే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సీఎం, అయన కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల దోపీడి వల్లనే తెలంగాణ దివాళా తీసిందని విమర్శించారు.

కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని, అట్లాంటి పరిపాలనకు సంబరాల పేరిట బలవంతపు కార్యక్రమాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. 72 సార్లు ఎందుకు ఢిల్లీకి వెళ్ళాడో చెప్పాలని డిమాండ్ చేశారు. 30 నెలల్లో 72 సార్లు ఢిల్లీకి వెళ్లి ఎవరిని బతిమాలుకోవడానికి వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి కేవలం ఒక్క రాష్ట్ర రైతాంగానికే రూ.లక్ష 13 వేల కోట్లు ఎగగొట్టారని దుయ్యబట్టారు. రైతు బంధు ఇవ్వకుండా, సంపూర్ణ రుణ మాఫీ చేయకుండా, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన ఆర్థిక సహాయం చేయకుండా పూర్తిగా డబ్బులు ఎగ్గొట్టాడని దుయ్యబట్టారు. ఇప్పటిదాకా ఎగగొట్టిన రూ.లక్షా 13 వేల కోట్ల బాకీ ఎప్పుడు కడతావు అంటూ ప్రశ్నించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>