కలం, వెబ్ డెస్క్ : పాదయాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ స్ఫూర్తితో పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం మిర్యాలగూడలో జరిగిన రైతు ధర్నా వేదికగా కేటీఆర్ ప్రకటన చేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తానని వెల్లడించారు.
గతంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కోదాడ నుంచి హాలియా వరకు చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితో తాను కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్‌లో 180 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ, సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు చుక్క నీరు కూడా విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట కావాలనే నిర్లక్ష్యం వహిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
2003 సంవత్సరంలో ఇలాంటి పరిస్థితులే ఏర్పడినప్పుడు కేసీఆర్ కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చెప్పారు. పాదయాత్రతో అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేశారని కేటీఆర్ (KTR) కొనియాడారు. కేసీఆర్ స్ఫూర్తితో నేడు పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతానని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 14వ తేదీలోపు సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించిన స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రకటించాలని డెడ్ లైన్ విధించాలన్నారు. లేకపోతే వేలాది మంది రైతులతో కలిసి పాదయాత్ర చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు.
Also Read : కొండా సురేఖ వివాదం.. లోక్ భవన్‌కు సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

