నాగోబ ఆలయ అభివృద్ధికి బొజ్జు పటేల్ శ్రీకారం

కలం, ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండలంలోని ప్రసిద్ధ కేస్లాపూర్ (Keslapur) శ్రీ నాగోబ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.21 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శ్రీకారం చుట్టారు. ముందుగా శ్రీ నాగోబ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం రూ.21 కోట్లతో చేపట్టనున్న పనులపై ఆలయ పీఠాధిపతి, ఆలయ కమిటీ చైర్మన్, మెస్రం వంశస్థులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మరింత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అభివృద్ధి పనుల్లో భాగంగా వీఐపీ గెస్ట్‌హౌస్ నిర్మాణం, ఆలయ ముఖద్వారం అభివృద్ధి, కోనేరు పొడిగింపు, గార్డెన్ ఏర్పాటు తదితర పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>