కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లోక్ భవన్ చేరుకున్నారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసి తాజా పరిణామాలను వివరించబోతున్నారు. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి గవర్నర్ కు నోట్ పంపించారు. ఈ అంశంతో పాటు కేబినెట్ విస్తరణపైనా గవర్నర్‌తో చర్చించే అవకాశం ఉందని సమాచారం. సీఎం రేవంత్ వెంబడి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ కూడా ఉన్నారు. కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడంతో ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో మూడు పదవులు ఖాళీలున్నాయి.
Also Read : కేసీఆర్ అడుగుజాడల్లో కేటీఆర్.. పాదయాత్రపై కీలక ప్రకటన
Follow Us On: X(Twitter)

