మేడిగ‌డ్డను కాంగ్రెస్ నాయ‌కులే పేల్చేశారు.. కేటీఆర్ తీవ్ర ఆరోప‌ణ‌లు

క‌లం, వెబ్‌డెస్క్‌: మేడిగ‌డ్డ ప్రాజెక్టు (Medigadda Project) కొట్టుకుపోవాల‌న్న‌దే సీఎం రేవంత్ రెడ్డి కోరిక అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మేడిగ‌డ్డ ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు పూర్త‌వుతున్నా క‌నీసం రెండు పిల్ల‌ర్ల‌కు రిపేర్లు చేయ‌లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులే మేడిగ‌డ్డ‌ను పేల్చేశార‌ని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై ప్రాజెక్టు ఇంజినీర్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశార‌ని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమ‌య్యాయ‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. సీఎం రేవంత్ రెగ్యుల‌ర్ సీఎం కాద‌ని, రెన్యువ‌ల్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పార్టీల‌కు కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్ర నేత‌లు బానిస‌లు అని విమ‌ర్శించారు. రాష్ట్ర‌ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పాల‌న ప‌ట్ల విసుగు చెందార‌ని, మ‌ళ్లీ బీఆర్ఎస్ ఎప్పుడు అధికారంలోకి వ‌స్తుందా అని ఎదురుచూస్తున్నార‌ని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణా రెడ్డి ఆధ్వ‌ర్యంలో భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఇత‌ర పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు నేడు బీఆర్ఎస్‌లో చేరారు. వీరికి కేటీఆర్ (KTR) పార్టీ కండువాలు క‌ప్పి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంతా కేసీఆర్ ఊహించిన విధంగానే జ‌రుగుతుంద‌ని చెప్పారు. కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య విబేధాలు పెరిగి, రెండేళ్ల త‌ర్వాత బీఆర్ఎస్ పార్టీ వ‌ద్ద‌కే వ‌స్తార‌ని కేసీఆర్ ముందే చెప్పార‌ని గుర్తు చేశారు.

Also Read : చంద్రబాబుకు లొంగిపోయిన రేవంత్: హరీశ్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>