చంద్రబాబుకు లొంగిపోయిన రేవంత్: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: కృష్ణా నీళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు పూర్తి అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao)  విమర్శించారు. తన గురువు ఏపీ సీఎం చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోయారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీ నీళ్లు తరలించుకుపోవడానికి ఏడాది కాలంగా సర్వే జరుగుతుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లడానికి నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) కింద సొరంగం పనులు చేసేలా ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఒకవేళ ఈ సొరంగం పూర్తయితే.. నాగార్జున సాగర్ ఖాళీ అయిపోతుందన్నారు. హైదరాబాద్‌కు తాగు నీరు కూడా అందదని.. మళ్లీ వలసలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం వలనే శ్రీశైలం ప్రాజెక్టులో మన వాటా దక్కకుండా పోయిందన్నారు.

భూములు కంటపడితే పాపమే..

సీఎం రేవంత్ రెడ్డికి భూములు కంటపడటమే పాపమని హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. భూములు అమ్మడంపైనే ఫోకస్ పెట్టారని.. ఇలా జరిగితే భవిష్యత్తు తరాల పరిస్థితేంటన్నారు. ఇప్పటికే 26 వేల ఎకరాల భూమి అమ్మేశారని.. మరికొన్ని వందల ఎకరాలను బ్రోకర్లకు .500 కోట్లు లంచం ఇచ్చి.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో పెట్టి రూ.20 వేల కోట్ల అప్పులు తెచ్చారన్నారు. ఇప్పుడు మియాపూర్ ప్రాంతంలో 400 ఎకరాలు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూములను కూడా వదిలిపెట్టకుండా చివరికి యూనివర్సిటీల భూములను కూడా తెగనమ్ముతున్నారని విమర్శించారు. ఇకనైనా భూముల అమ్మకాల ఆలోచనను విరమించుకోవాలన్నారు.

Also Read : రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>