మామడను కరువు మండలంగా ప్రకటించాలి.. బీఆర్‌ఎస్‌ డిమాండ్

కలం, మామడ: మామడ(Mamda) మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, ఇతర సహాయక చర్యలు కల్పించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటల సాగు, దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.

రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మామడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించేలా ప్రభుత్వానికి నివేదించాలని తహసీల్దార్‌ను కోరారు. కరువు ప్రభావిత రైతులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మామడ మండల బీఆర్‌ఎస్‌ కన్వీనర్ చంద్రశేఖర్ గౌడ్, పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి రత్నయ్య, నాయకులు సాయిరెడ్డి, చిన్న లింగారెడ్డి, అశోక్, సుధాకర్‌రావు, మహేందర్, రాజసాగర్, రమేష్, కొండ్ర అశోక్, చిన్నయ్య, భూషణ్, యూసుఫ్, ఏటి రాజేశ్వర్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>