epaper
Wednesday, February 18, 2026
epaper

‘కోవా బన్’ చుట్టూ పొలిటికల్ హీట్.. లక్షల్లో విరాళాలు..!

కలం, డెస్క్ : కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న కోవాబన్ వ్యాపారి వలీకి జరిగిన ఘటన (Kova Bun Issue) చుట్టూ పొలిటికల్ హీట్ తయారైంది. కల్తీ కోవా బన్ అంటూ మొదలైన వివాదం కాస్తా.. మతం రంగు పూసుకుంది. ఆ తర్వాత పొలిటికల్ రంగులోకి మారింది. మేడారం మహా జాతరలో కోవా బన్ అమ్ముతున్న రాయలసీమకు చెందిన షేక్ షావలీని.. కల్తీ కోవా బన్ అమ్ముతున్నావంటూ ఓ యూట్యూబర్ అడగడం.. వరుస ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం.. వలీ కోవా బన్ తిని చూపించడం.. చివరకు వలీ మతం గురించి మాట్లాడటం.. ఇదంతా పెద్ద రచ్చకు దారి తీసింది. జాతర జరిగిన చాలా రోజులకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అంతా తమ వంతుగా స్పందించేశారు. కానీ ఇక్కడ తెలంగాణ పార్టీల కంటే ఏపీ పొలిటికల్ పార్టీలే ఇందులో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాయి.

ఈ ఘటనపై ముందుగా టీడీపీ, ఆ తర్వాత జనసేన రియాక్ట్ అయ్యాయి. వలీకి అండగా వేలాది మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. చివరకు వలీ ఇంటికి యూట్యూబ్ ఛానెళ్లు వెళ్లడం.. కోవా ఎలా తయారు చేస్తున్నారో లైవ్ లో చూపించడం చకచకా జరిగిపోయాయి. ఇదంతా వలీకి పాజిటివ్ గా మారిపోయింది. చాలా మంది వలీకి అండగా నిలుస్తూ విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇప్పటికే మైనార్టీ కమిటీ రూ.50 వేలు, ఎమ్మెల్సీ నాగబాబు రూ.25వేలు అందజేశారు. అలాగే ఆన్ లైన్ ద్వారా కూడా వలీకి ఆర్థిక సాయం చాలామంది అందజేస్తున్నారు. ఇలా అతనికి లక్షల్లో ఆదాయం సమకూరినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇంకోవైపు ఈ ఘటన (Kova Bun Issue) చుట్టూ పొలిటికల్ హీట్ ఎక్కింది. సెక్యులర్ పార్టీ అని చెప్పుకునేవి ఏవీ కూడా వలీ ఇన్సిడెంట్ గురించి మాట్లాడలేదు. తెలంగాణ గవర్నమెంట్ ఈ ఘటన మీద ఎందుకు స్పందించలేదు అని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే వైసీపీ ఇలాంటి ఘటనలకు స్పందించదా అని కూటమి పార్టీలు టార్గెట్ చేశాయి. తాము ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్నా సరే.. ఒక సామాన్యుడికి అన్యాయం జరిగితే మతంతో సంబంధం లేకుండా ఖండిస్తాం అని కూటమి పార్టీలు అంటున్నాయి.

వలీకి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నా సరే.. ఇప్పటికీ చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. వలీ అమ్మేది కచ్చితంగా కల్తీ కోవా బన్ అంటున్నారు. అవి తింటే పిల్లల హెల్త్ కు అస్సలు మంచిది కాదంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా కోవా బన్ వ్యాపారి వలి ఘటన చుట్టూ ఎన్నో వివాదాలు.. ఇంకెన్నో మలుపులు కనిపిస్తున్నాయి.

Read Also: ఐబొమ్మ రవికి బెయిల్​ మంజూరు..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>