కలం, నాగార్జునసాగర్ : ‘కళ్యాణ లక్ష్మి’ (Kalyana Lakshmi) పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య (Kondeti Mallaiah) అన్నారు. నల్గొండ జిల్లా మాడుగుల పల్లి (Madugulapally) తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సరోజా పావనితో కలిసి బుధవారం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాల అమలవుతున్నాయని, ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు.
పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చులను ఆర్థిక భారం తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ తమ వంతు పాత్ర పోషిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూసలపాడు సర్పంచ్ సైదిరెడ్డి, గజలాపురం సర్పంచ్ రోజా, అవంగాపురం సర్పంచ్ జానయ్య, కాంగ్రెస్ పార్టీమాడుగుల పల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్, పుల్లెంల నరసింహ, డిప్యూటీ తహశీల్దార్ కత్తుల సైదులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ
Read Also: డిజిటల్ విప్లవం

