కరీంనగర్‌లో ఘనంగా బాపూజీ జయంతి వేడుకలు

కలం, కరీంనగర్: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన స్పూర్తి ప్రదాత ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్‌లొ ప్రజా స్వామిక, మానవతావాది తెలంగాణ తొలితరం ఉద్యమం నాయకుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు(Konda Laxman Bapuji Jayanti) ఘనంగా జరిగాయి.

నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో పద్మశాలి సంఘం ఆద్వర్యంలో జరిగిన వేడుకలకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు పాలకవర్గ సభ్యలు, పద్మశాలి సంఘం నాయకులతో కలిసి మేయర్ ( Karimnagar Mayor)ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కొండ లక్ష్మణ్ బాపూజీ దేశం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సంధర్బంగా కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొండ లక్మణ్ బాపుజీ చూపిన ఆశయాలు… త్యాగనిరతి నేటి తరానికి ఎంతో స్పూర్తి దాయకం అన్నారు. 1938 లో పౌరహక్కుల ఉద్యమ సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా, వందేమాతర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని స్వాత్రంత్ర్య పోరాటం చేసిన యోదుడని కొనియాడారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో బాపూజీ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 ఉద్యమంలో తన మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన నిబద్ధత కలిగిన గొప్ప నాయకుడన్నారు. బడుగు బలహీన వర్గాలు, చేనేత వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. హైదరాబాద్ విముక్తి పోరాటంలో విప్లవ పంథాను అనుసరించిన బాపూజీ స్వాతంత్ర్యానంతరం పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థలో ఉపసభాపతిగా, మంత్రిగా, శాసనసభ్యునిగా సేవలందించారని గుర్తు చేశారు.

1952 లో బాపూజీ రూపొందించిన సహకార సంఘాలు దేశంలోనే ప్రప్రథమం కావడం విశేషం అన్నారు. 2010 స్వగ్రామం లో లక్ష్మణ్ సేవా సదన్ పేరుతో స్వచ్చంద సంస్థను స్థాపించి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. బాపూజీ చూపిన ఆశయాలు, త్యాగనిరతి నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు వాసాల రమేష్, మాసం గణేష్, చొప్పరి జయశ్రీ వేణు, వేముల కవిత చంద్రశేఖర్, పద్మశాలి సంఘం నాయకులు మెతుకు సత్యం తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>