కలం, వెబ్ డెస్క్: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval)కు అమెరికా కోర్టు పంపించిన సమన్లను భారత్ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు పూర్తిగా కల్పితం, నిరాధారమని.. ఇలాంటి పనికిమాలిన వ్యాజ్యాలను భారత్ ఎప్పటికీ పట్టించుకోదని ఘాటుగా సమాధానమిచ్చింది. ఒకవేళ నిజంగా సమన్లు పంపించాలంటే అది కేవలం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా పంపించాల్సి ఉంటుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) మీడియా సమావేశంలో వెల్లడించారు.
తనను హత్య చేసేందుకు అజిత్ దోవల్(Ajit Doval), రా మాజీ చీఫ్ సామంత్ గోయల్ కుట్ర చేస్తున్నారని అమెరికా పౌరుడు, ఖలీస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ 2024 సెప్టెంబరులో అమెరికా కోర్టులో పిటిషన్ వేశాడు. దీన్ని విచారించిన న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి.. అజిత్ దోవల్, సామంత్ గోయల్‌కు సమన్లు పంపించాలని ఆదేశించారు. అవసరమైతే ఢిల్లీలోని పాటియాలా కోర్టు సాయం కూడా తీసుకోవాలని సూచించారు. అయితే ఈ అంశాన్ని భారత్ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా.. ఈ సమన్లను కూడా తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
Also Read : ఇన్సూరెన్స్ లేకపోతే రూ.10 వేలు ఫైన్.. NHAI క్లారిటీ!
Follow Us On : WhatsApp

