సింగరేణికి మూడు కోల్ బ్లాక్‌ల కేటాయింపు: కిషన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. నైనీ కోల్ బ్లాక్, తాడిచెర్ల గనితో పాటు తాజాగా మణుగూరు కోల్ బ్లాక్ కూడా సింగరేణికే ఇచ్చామన్నారు. ఈ మూడింటి కేటాయింపుతో సింగరేణి సంస్థకు ఆర్థికంగా మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సింగరేణిని దోచుకున్నాయని విమర్శించారు. గనుల కేటాయింపు కూడా తమ ఘనతే అంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాయని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మూడు గనులను సింగరేణికే వచ్చేలా చేశామన్నారు. ఇతర రాష్ట్రాలు పోటీ పడినా.. తెలంగాణకే ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలా..?

ప్రధాని మోదీపై కొందరు అత్యంత అభ్యంతరకరమైన భాష ఉపయోగిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం చనిపోయిన ఆయన తల్లికి కూడా గౌరవం ఇవ్వకుండా తిట్టారని మండిపడ్డారు. తమిళనాడులో ఇలాగే తిట్టారని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేశారని.. అక్కడ టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతుగా ఉందన్నారు. ఇక్కడ మాత్రం ప్రధానిని తిట్టిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ గగ్గోలు పెడుతోందన్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని.. ఇష్టమొచ్చినట్లు తిట్టడానికి మాత్రం కాదన్నారు. రాహుల్ గాంధీపై కూడా ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా.. అని ప్రశ్నించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>