పార్లమెంటుకు చేరిన మున్సిపోల్స్ ఇష్యూ

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల అంశాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)  లోక్‌సభలో మంగళవారం లేవనెత్తారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నదని, ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులకు బెదిరింపులు వస్తున్నాయని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ఒక బీజేపీ అభ్యర్థి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందని, దీనికి కారణం అధికార పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన బెదిరింపులు, ఒత్తిడేనని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని ఆరవ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎరుకల మహదేవప్ప సోమవారం అర్ధరాత్రి సూసైడ్ చేసుకున్నారని, కాంగ్రెస్ నుంచి వచ్చిన హెచ్చరికలే కారణమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యం కిడ్నాప్‌లు, అత్యాచారాలు, అరాచకాలు, బెదిరింపులు పెరిగిపోయాయని మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక షెడ్యూలు తెగకు చెందిన బీజేపీ అభ్యర్థి సూసైడ్‌ను ఈ సభలో ఉన్న సభ్యులంతా ఖండించాలని, కాంగ్రెస్ పాలనలోని అరాచకాలను వ్యతిరేకించాలని (Kishan Reddy) డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>