కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మదీనాగూడలో ఉన్న నారాయణ పాఠశాల (Narayana School) లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్కూల్ సెల్లార్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పాఠశాల భవనం మొత్తం దట్టమైన పొగలు కమ్మేశాయి. ప్రమాదాన్ని గుర్తించిన పాఠశాల సిబ్బంది అప్రమత్తమై విద్యార్థులందరినీ వెంటనే భవనం బయటకు సురక్షితంగా తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ప్రాథమిక సమాచారం.


