Mobile Popup Ad
Mobile Popup Ad

వర్షాల నేపథ్యంలో అప్రమత్తం.. అధికారులకు అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా అదనపు కలెక్టర్ మధు నాయక్ (Madhusudan Naik) సూచించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వెబెక్స్ ద్వారా మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్‌డీఓ, డీఆర్‌డీఓ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. మండల స్థాయిలో తహశీల్దార్‌ను డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారిగా నియమిస్తూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గతంలో ఎదురైన సమస్యలను సమీక్షించి, ఈ సంవత్సరం అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు తగిన అవగాహన కల్పించేందుకు ప్రతి రెండు రోజులకు గ్రామాలలో టామ్‌టామ్ నిర్వహించాలని, అత్యవసర పరిస్థితులలో స్పందించేందుకు గజ ఈతగాళ్ల వివరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. వర్షపు నీరు ప్రవహించే ప్రాంతాలు, కాజ్వేలు వంటి ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని అదనపు కలెక్టర్ (Madhusudan Naik) చెప్పారు.

గ్రామాలలో విద్యుత్ స్తంభాలు, వైర్లు సురక్షితంగా ఉన్నాయో లేదో పరిశీలించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్ పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, గ్రామ స్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని త్వరగా ఉన్నతాధికారులకు చేరవేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.

Read Also: ‘ మేం రాజీనామా చేస్తాం.. మీరు రెడీనా?’.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>