Mobile Popup Ad
Mobile Popup Ad

పాము కాటుకు చెక్.. ‘కిసాన్ మిత్ర ఛడీ’తో రైతుల ప్రాణాలు సేఫ్!

కలం, వెబ్ డెస్క్: రైతులకు రక్షణ కవచంలా ‘కిసాన్ మిత్ర ఛడీ’ (Kisan Mitra Chhadi) పేరుతో సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. పొలాల్లో పనిచేసే సమయంలో పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న రైతులను రక్షించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పరికరాన్ని ప్రారంభించారు. సుమారు 100 మీటర్ల దూరంలో ఉండే జీవుల కదలికలను ముందే పసిగట్టే ఈ పరికరం, వైబ్రేషన్ ద్వారా రైతును అప్రమత్తం చేస్తుంది. ఇందులో అదనంగా సోలార్ టార్చ్‌లైట్ సౌకర్యం కూడా ఉంది. చీకటి సమయాల్లో పొలాలకు వెళ్లే రైతులకు (Farmers) ప్రయోజనకరంగా ఉంటుంది. అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఈ పరికరం ద్వారా పాము కాటు మరణాలను తగ్గించవచ్చని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>