Mobile Popup Ad
Mobile Popup Ad

అస్సాం అసెంబ్లీ ఎన్నికలు.. 42 మందితో కాంగ్రెస్ తొలి జాబితా

కలం, డెస్క్ : త్వరలో జరగబోయే అస్సాం (Assam) అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అప్పుడే 42 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. మార్చి-ఏప్రిల్ లో అస్సాం (Assam) అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీని కోసం త్వరలోనే ఈసీ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్ లో అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ గోర్హాట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మరో కీలక నేత రిపున్ బోరా బర్బల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

మజులి నుంచి ఇంద్రనీల్ పెగు, దిస్పూర్ నుంచి మీరా బోర్తాకకూర్ బరిలోకి దిగుతున్నారు. ఈ సారి అస్సాంలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. అందుకే అన్ని పార్టీల కంటే ముందే ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని గద్దె దించాలని బలంగానే కాంగ్రెస్ పోరాడుతోంది. 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ముందు ప్రకటించేసి ప్రచారం పెద్ద ఎత్తున చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు అసంతృప్తులను బుజ్జగించి.. అందరినీ ఒక్కతాటి మీదకు తేవాలని పార్టీ ఢిల్లీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>