కలం, నిర్మల్: ఖానాపూర్ నియోజకవర్గంలోని సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న కొమురం భీం విగ్రహానికి నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన కొమురం భీం వంటి ఆదివాసీ పోరాట యోధుల స్ఫూర్తిని చాటిచెప్పే కార్యక్రమాలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

