ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే నమ్మొద్దు.. ఎమ్మెల్యే బొజ్జు కీలక సూచన

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ మండలం లక్కారం (Lakkaram) గ్రామంలో గురువారం నిర్వహించిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur MLA) వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని తెలిపారు.

పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బొజ్జు పటేల్ తెలిపారు. గుడిసెలు లేని గ్రామాలను చూడాలనేది సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్ష అని పేర్కొన్నారు.

ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ప్రతి అర్హుడికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు అందించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. లక్కారం గ్రామంలో అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేసి, గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>