ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు అరుదైన ఘ‌న‌త‌!

క‌లం, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క ఫోర్బ్స్ ఇండియా షో స్టాప‌ర్స్ – 2026 (Forbes India Showstoppers) మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై స్థానం ద‌క్కించుకున్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌చురించిన ఈ మ్యాగ‌జైన్ జాబితాలో ఇంకా దేశంలో ఎంతో మంది స్టార్ల ఫోటోలు కూడా ప్ర‌చురించారు. వీరిలో విరాట్ కోహ్లీ, షారూఖ్ ఖాన్‌, స్మృతి మంధాన కూడా ఉన్నారు. దేశ వ్యాప్తంగా సినీ, క్రీడా, సంగీత రంగాల్లో విశేష సేవ‌లందించిన ప్ర‌ముఖుల‌తో ఈ జాబితాను రూపొందించారు. వీరిలో తెలుగు హీరోకు చోటు ద‌క్క‌డంపై హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

పుష్ప మూవీ సాధించిన ఘ‌న విజ‌యం అల్లు అర్జున్‌కు దేశ వ్యాప్తంగా కీర్తి ప్ర‌తిష్ట‌లు తెచ్చిపెట్టింది. బ‌న్నీని ఈ సినిమా పాన్ ఇండియా స్టార్‌ను చేసేసింది. ఈ సినిమాతో బ‌న్నీ ఫాలోయింగ్ పెర‌గ‌డంతో పాటు ఇత‌ర భాష‌ల డైరెక్ట‌ర్ల నుంచి బ‌న్నీకి స్టోరీలు రావ‌డం కూడా మొద‌లైంది. ఇప్ప‌టికే బ‌న్నీ ఓ త‌మిళ డైరెక్ట‌ర్‌తో మ‌రో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇక ఫోర్బ్స్ జాబితాలో బ‌న్నీకి చోటు ద‌క్క‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో పోస్టుల‌తో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>