కలం, ఖమ్మం బ్యూరో: టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు, ప్రజా రవాణావ్యవస్థకు (బస్సులు) నష్టం కలిగించడం తీవ్రమైన నేరమని ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (Sunil Dutt) బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ డ్రైవర్లు ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదని, పోలీసులు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తారని పేర్కొన్నారు. అదే విధంగా బస్సులకు, ప్రభుత్వ అస్తులకు నష్టం కలిగించడం, ఆటంకాలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమ్మె పేరుతో బస్సులపై రాళ్లు రువ్వడం, వాటిని ధ్వంసం చేయడం వంటి ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని కమిషనర్ (Sunil Dutt) ఆ ప్రకటనలో తెలియజేశారు.

