అమ్మవారి త్రిశూలం చోరీ.. దొంగ అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం (Kothagudem) పట్టణంలోని పోచమ్మ గుడిలో అమ్మవారి త్రిశూలంతో పాటు హుండీలో ఉన్న రూ.300 దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు మర్రిగూడెం గ్రామానికి చెందిన, మడవి భద్రయ్యగా గుర్తించారు. విచారణలో అమ్మవారి త్రిశూలంతో పాటు అదే రోజు రామవరంలోని భూక్య లావణ్య కిరాణా షాపులో రూ.4 వేలు నగదు తో పాటు, మద్యం బాటిళ్లు కూడా దొంగతనం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అలాగే ఈ నెల 15న పట్టణంలోని సాయిబాబా గుడిలో బాబా వెండి కడియాలు, కుంకుమ భరణి దొంగిలించిన గుడి పూజారి బొబ్బర్ల శ్రీనివాస్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడియాలు, కుంకుమ భరణిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>