మోడల్ సోలార్ విలేజ్‌గా గొడిశాల ఎంపిక

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిశాల గ్రామం (Godishala) మోడల్ సోలార్ విలేజ్‌గా ఎంపికైందని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలోని మోడల్ సోలార్ విలేజ్ కంపోనెంట్‌లో భాగంగా, అత్యధిక సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న గ్రామంగా గోడిశాలను ఎంపిక చేశారని తెలిపారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ (DLC) సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గొడిశాల గ్రామంలో 7 ప్రభుత్వ భవనాలకు సోలార్ వ్యవస్థ చేయనున్నారని తెలిపారు. 3 వాటర్ పంపులు, 44 వీధి దీపాలకు ఏర్పాటు చేయనున్నారనీ చెప్పారు. ఈ పనుల కోసం తయారు చేసిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) డిస్టిక్ లెవెల్ కమిటీ ఆమోదం తెలిపింది.

గ్రామానికి రూ.కోటి మంజూరు..

త్వరలో గొడిశాల గ్రామానికి కేంద్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేయనుందని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. నిధులు విడుదలైన తర్వాత 6 నెలల వ్యవధిలో అన్ని పనులను ఎంఎన్ఆర్ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గోడిశాల గ్రామం పునరుత్పాదక ఇంధన వినియోగంలో ఆదర్శంగా నిలిచి, ఇతర గ్రామాలకు మార్గదర్శకంగా మారనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీవో జగదీశ్వర్, డీఆర్డీవో శ్రీధర్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్, లీడ్ బ్యాంకు మేనేజర్ రవిశంకర్, టీజీ రెడ్కో డెవలప్మెంట్ ఆఫీసర్ మునీందర్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ లక్ష్మికాంత్, సైదాపూర్ ఎంపీడీవో యాదగిరి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>