తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. ఖమ్మంలో దొంగ అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను ఖమ్మం 3 టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ. లక్ష విలువైన బంగారు, వెండి ఆభరణాలు నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ​పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం (Khammam), జహీరపురలోని గుట్టల బజార్‌కు చెందిన తుడుము గోపి (28) ఈ నెల 12న తాళం వేసి ఉన్న ఒక ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డాడు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును చోరీ చేసి పరారయ్యాడు. ​

చేసిన సొత్తును విక్రయించి సొమ్ము చేసుకోవడానికి శుక్రవారం గాంధీచౌక్‌లోని గోల్డ్ షాప్‌ల సముదాయం వద్దకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న 3 టౌన్ పోలీసులను చూసి భయంతో పారిపోవడానికి ప్రయత్నించాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే వెంబడించి పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించగా, దొంగతనం చేసిన విషయాన్ని అంగీకరించాడు.

​ఈ దాడిలో నిందితుడి వద్ద నుంచి 6.25 గ్రాముల బంగారు చెవి దిద్దులు, బుట్టాలు, 81 గ్రాముల బరువుగల 3 జతల వెండి పట్టీలు రూ. 7 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ సొత్తు మొత్తం విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు. తుడుము గోపికి నేర చరిత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అతడిపై గతంలో ఒక పోక్సో కేసుతో పాటు మరికొన్ని కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఐరన్ దొంగిలించిన ఇద్దరు కటకటాల్లోకి!

నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఇనుప చువ్వలను దొంగిలించిన కేసులో ఖమ్మం జిల్లా ఎన్కూరు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన ఐరన్ సహా రవాణాకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను కల్లూరు సబ్ డివిజన్ ఏసీపీ వసుంధర యాదవ్ శుక్రవారం వెల్లడించారు. నాచారం గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఇనుప చువ్వలు దొంగతనానికి గురైనట్లు, పోలీసులకు ఫిర్యాదు అందింది. దొంగిలించిన ఐరన్‌ను తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బేతాలపాడు గ్రామానికి చెందిన చింతల సాయి గణేశ్ (22), శ్రీకాకుళం జిల్లా ఇబ్రాహింబాదుకు చెందిన కిల్లి వెంకటేశ్ (25) అనే ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>