కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లాలో గ్యాస్ కొరత అంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో చేస్తున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు సీపీ సునీల్ దత్. నకిలీ వాట్సాప్/ఎస్ఎంఎస్ లింకులు, తక్షణ డెలివరీ ఆశ చూపి అడ్వాన్స్ డబ్బులు అడగడం, కేవైసీ అప్‌డేట్ పేరుతో ఓటీపీ అడగడం లాంటివి చేస్తున్నారని.. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
గ్యాస్ సిలిండర్ ను అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని ఖమ్మం (Khammam) సీపీ సూచించారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్యాస్ కొరత ఉందని, వెంటనే బుక్ చేసుకోండి అని వచ్చే మెసేజ్ లు లేదా వాట్సాప్ లింక్‌లను నమ్మొద్దని కోరారు. ఒకవేళ మోసపోతే.. వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని, cybercrime.gov.in వెబ్సైట్ లో కూడా రిపోర్ట్ చేయవచ్చని సీపీ తెలిపారు.

