తమ్మినేనికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

కలం, ఖమ్మం బ్యూరో: సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతోపాటు ఇతర రాష్ట్ర నాయకులు తమ్మినేనిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ్మినేని ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు రోజుల్లో కోలుకుంటారని తెలిపారు. కాగా తమ్మినేని ఆరోగ్యం పట్ల సీపీఎం (CPM) శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>