కలం, ఖమ్మం బ్యూరో: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఖమ్మం జిల్లా (Khammam) వైరా, కొణిజర్ల మండలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. అష్టగుర్తి గ్రామంలో బలగాని నర్సింహారావు అనే వ్యాపారి ఒక పాడుబడిన ఇంట్లో అక్రమంగా ఉంచి రేషన్ బియ్యాన్ని గుర్తించారు. 9.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని సీజ్ చేసి స్థానిక రేషన్ డీలర్‌కు అప్పగించారు.
నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిల్వలకు పాల్పడిన బలగాని నరసింహారావుపై 6A కింద కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది తెలిపారు. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులకు బియ్యం సక్రమంగా అందుతున్నాయో లేదో అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొణిజర్ల మండలంలోని పలు రేషన్ షాపులలో ఈ బృందం తనిఖీలు చేపట్టింది. ప్రతిరోజూ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జిల్లాలోని ఏదో ఒక మండలంలో ఈ విస్తృత తనిఖీలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Also Read : మరాఠీలకు శివాజీ.. తెలంగాణకు సర్వాయి పాపన్న: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

