హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలి: కూనంనేని

​కలం, ఖమ్మం బ్యూరో: సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు నాణ్యమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) స్పష్టం చేశారు. హాస్టళ్లలో మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనం, పౌష్టికాహారంతో పాటు ఉత్తమ విద్యా సౌకర్యాలు నిరంతరం అందేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ​చుంచుపల్లి మండల పరిధిలోని ఎస్ఆర్​ డీజీ పాఠశాలలో స్వర్గీయ దాసరి లక్ష్మి జ్ఞాపకార్థం సంక్షేమ వసతి గృహ విద్యార్థినులకు శుక్రవారం నిర్వహించిన వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి లక్ష్మి కుమారుడు దాసరి వెంకటేశ్వర్లు, కోడలు దాసరి కృష్ణవేణి సమకూర్చిన వస్త్రాలను ఎమ్మెల్యే కూనంనేని విద్యార్థినులకు అందజేశారు. ​అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, కష్టపడి చదువుకుని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగడమే నిజమైన విజయమన్నారు.

విద్యార్థినుల ఉన్నత ఎదుగుదలకు తోడ్పడే సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. ‘దాసరి లక్ష్మి’ కుటుంబం చేసిన ఈ సేవా కార్యక్రమాలు అభినందనీయమని, సమాజంలో వెనుకబడిన వర్గాల పిల్లలకు ఇలాంటి స్వచ్ఛంద సేవలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ ఇటువంటి సత్కార్యాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్​కే సాబీర్ పాషా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>