కలం, వెబ్‌డెస్క్: భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు కీలక బాధ్యత దక్కింది. తొలి జీతో ప్రీమియర్ లీగ్ (JITO Premier League) బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన ఎంపికయ్యారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద కమ్యూనిటీ క్రికెట్ లీగ్. ఈ టోర్నీ శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనుంది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. జైన్ కమ్యూనిటీకి చెందిన యువ ప్రతిభను వెలికితీయడమే ఈ లీగ్ ప్రధాన లక్ష్యం. ఒక ప్రొఫెషనల్ క్రికెట్ వేదికను అందించేందుకు JPL ఛైర్మన్ వికీ ఓస్వాల్ ఈ టోర్నీని రూపొందించారు. ఈ లీగ్‌లో మొత్తం 12 ఫ్రాంచైజీ జట్లు పోటీపడతాయి.
33 మ్యాచ్‌లలో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 250 మంది అత్యుత్తమ జైన్ క్రికెటర్లు ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లను ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ స్పోర్ట్స్ ఛానెళ్లు, లైవ్ స్కోరింగ్ యాప్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar) రాక తమ లీగ్‌కు ఎంతో బలాన్ని ఇస్తుందని వికీ ఓస్వాల్ తెలిపారు. సూర్య ఆట తీరు, క్రమశిక్షణ యువతకు స్ఫూర్తినిస్తాయని చెప్పారు. JPL కేవలం ఒక టోర్నీ మాత్రమే కాదని, క్రీడల్లో కొత్త తరాన్ని ప్రోత్సహించే ఒక అద్భుత వేదిక అని ఆయన వెల్లడించారు.
Also Read : బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు నిరాశ
Follow Us On: X(Twitter)

