Mobile Popup Ad
Mobile Popup Ad

బైక్ దొంగతనాలు.. ఖమ్మంలో ‘హిమాలయన్’ బైక్‌తో నిందితుడు అరెస్ట్!

కలం, ఖమ్మం బ్యూరో: గంజాయి కొనుగోలు, వినియోగం కోసం ఖమ్మం నగరంలో వరుస బైక్ దొంగతనాలకు (Bike Theft Case) పాల్పడుతున్న ఒక నిందితుడిని ఖానాపురం హవేలీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి దొంగిలించబడిన నలుపు రంగు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

​ఖానాపురం హవేలీ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. గుత్తికొండ యశ్వంత్ (22) అనే నిందితుడు తన సహచరులతో కలిసి ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలలో మోటార్ సైకిళ్లను దొంగిలిస్తున్నాడు (Bike Theft Case). ఆ వాహనాలను ఒడిశాలో విక్రయించి, వచ్చిన డబ్బుతో గంజాయి కొనుగోలు చేసి నగరంలో వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు.

​ఈ క్రమంలో శనివారం గొల్లగూడెం శివారులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న యశ్వంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ చోరీల పర్వం వెలుగుచూసింది. నిందితుడి వద్ద నుండి రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ (నెం. TG04 D 0126) ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రదేశాలలో పార్కింగ్ చేయడంతో పాటు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Read Also: ప్లీజ్ ప్రధాని మోదీ.. ఈసారి తప్పు చేయొద్దు: రాహుల్ గాంధీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>