కలం, హనుమకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. శనివారం పరకాలలో పర్యటించిన కవిత బస్టాండ్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి మహిళలతో కలిసి కోలాటం ఆడారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు యూరియా కోసం ఉదయం 5 గంటల నుంచే యాప్‌లో బుకింగ్ కోసం తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనమైనా దొరుకుతుంది కానీ, యూరియా మాత్రం దొరకడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే యూరియా యాప్ రద్దు చేసి రైతులకు ఎరువుల దుకాణాల ద్వారా సరిపడా యూరియాను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కవిత సూచించారు.
Read Also: మీనాక్షి నటరాజన్‌కు సంబంధం లేదు: కుంభం శివకుమార్ రెడ్డి
Follow Us On : WhatsApp

