కిక్కిరిసిన భాగ్యనగరం.. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి

కలం, వెబ్ డెస్క్: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న 69 అడుగుల ఖైరతాబాద్ పంచముఖ సంకటహర మహా గణపతి (Khairatabad Ganapati) భారీ భక్తజన సందోహం నడుమ ట్యాంక్ బంద్ వద్ద హుస్సేన్ సాగర్ లో గంగమ్మ ఒడికి చేరారు. పంచముఖ మహాగణపతిని భారీ క్రేన్ సహాయంలో ట్యాంక్ బండ్ వద్ద  నిమజ్జనం చేశారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం సజావుగా సాగింది. ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు వేలాది భక్తులు తరలివచ్చారు. బై బై గణేశా అంటూ నినాదాలతో ట్యాంక్ బండ్ హోరెత్తింది.

మళ్ళీ రావయ్యా గణేశా..

శోభాయాత్రలో భక్తులు పాల్గొని స్వామి వారి ఎదుట డ్యాన్స్ చేస్తూ.. ‘మళ్ళీ రావయ్యా గణేశా’ అంటూ సాగనంపారు. ఎంతో అపురూపంగా తొమ్మిదిరోజులు భక్తిపారవశ్యంతో పూజలందుకున్న గణపయ్యను భక్తులు బరువెక్కిన హృదయంతో నిమజ్జనం చేశారు. మహాగణపతి నిమజ్జనంతో భక్తుల హృదయం భావోద్వేగంతో నిండిపోయింది.

పటిష్ట బందోబస్తు విజయవంతం..

ఖైరతాబాద్ మహా గణపతి (Khairatabad Ganapati) నిమజ్జనం ఎలాంటి ఆటంకం జరుగకుండా పోలీసులు నిర్వహించిన పటిష్ట బందోబస్తు విజయవంతమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రత్యేక సీసీటీవీ నిఘా, వేలాది మందితో ఎక్కడికక్కడ బందోబస్తు నిర్వహించారు. గణేష్ నిమజ్జనానికి 20 వేల మంది పోలీసులతో భారీ భద్రతతో పాటు10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ.

మూడు షిఫ్టుల్లో షీ-టీమ్స్..

100 హైరైజ్ కెమెరాలతో విగ్రహాల లెక్కింపు చెపట్టింది. 8,142 మంది అదనపు సిబ్బంది.. 42 ప్లాటూన్లు.. 4 RAF, 2 CRPF కంపెనీలతో కేంద్ర బలగాల మోహరించి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం సజావుగా సాగేలా కృషి చేశారు. నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లుతో పాటు 26 షీ-టీమ్స్ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి వరకు వినాయక నిమజ్జనం కొనసాగనుండటంతో పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు.

Also Read : సిక్కింలో వరద బీభత్సం.. విరిగిపడిన కొండచరియలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>