గుండెపోటుతో ​అగ్నిమాపక అధికారి అనిల్ మృతి

కలం, ​వేములవాడ: వేములవాడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగు అనిల్ కుమార్ (45) శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మరణంతో వేములవాడ అగ్నిమాపక శాఖతో పాటు ఆయన స్వగ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది.

సామాన్య ఉద్యోగి నుండి అధికారిగా..

2008 బ్యాచ్‌కి చెందిన అనిల్ కుమార్ (Vemulawada Fire Officer) అగ్నిమాపక శాఖలో డ్రైవర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. తన కష్టపడే తత్వం, నిబద్ధతతో క్రమంగా ఎదుగుతూ స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. గత రెండేళ్లుగా ఆయన వేములవాడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సమర్థవంతమైన సేవలు..

వేములవాడలో విధులు నిర్వర్తించిన కాలంలో ఆయన ప్రజల, తోటి సిబ్బంది మన్ననలు పొందారు. పట్టణంలో పలు అవగాహన కార్యక్రమాల ద్వారా అగ్నిప్రమాదాల నివారణకు విశేష కృషి చేశారు. అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో తన సిబ్బందితో కలిసి సాహసోపేతంగా వ్యవహరించి, ఎన్నో ప్రాణాలను, ఆస్తి నష్టాన్ని కాపాడారు.

శోకసంద్రంలో కుటుంబం.. ​నేడు అంత్యక్రియలు..

అనిల్ కుమార్ గారి అకాల మరణ వార్త విన్న వేములవాడ అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. మృతుని అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా తుమ్మలగూడెంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరగనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>