నిజామాబాద్ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు

కలం, నిజామాబాద్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ (BJP Nizamabad) జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్, శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, శిక్షణ తరగతుల ఇంచార్జి గోలి మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మి నరసయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్, వడ్డీ మోహన్ రెడ్డి కంచెట్టి గంగాధర్, గద్దె భూమన్న, భరత్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిలు పోతంకర్ లక్ష్మి నారాయణ నాగోల్ల లక్ష్మి నారాయణ నిమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఆందోళనలు, SIR అంశంపై పార్టీ చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ, అలాగే గ్రామ స్థాయి వరకు పార్టీని మరింత బలంగా తీసుకెళ్లే విధానంపై విస్తృతంగా చర్చించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని నాయకులు నిర్ణయించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>