epaper
Monday, November 17, 2025
epaper

అయ్యప్ప భక్తులకు కేరళ సర్కార్ సూచన

కలం డెస్క్ : అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక సర్క్యులర్ జారీచేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో Brain Fever (అమీబిక్ మెనింజో ఎన్‌సెఫలైటిస్) కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున వివిధ ప్రాంతాల నుంచి శబరిమల(Sabarimala) ఆలయానికి దర్శనం నిమిత్తం వచ్చే అయ్యప్ప భక్తులు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నదని, భక్తుల అవసరాల నిమిత్తం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లతో పాటు వెంటనే వైద్య సౌకర్యం అందేలా డిస్పెన్సరీలను కూడా నెలకొల్పినట్లు పేర్కొన్నది. నదుల్లో స్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు తాగునీరు, ఆహారపదార్ధారల విషయంలోనూ ప్రత్యేక కేర్ తీసుకోవాలని సూచించింది. శబరిమల ఆలయాన్ని అయ్యప్ప భక్తుల కోసం నవంబరు 17 నుంచి తెరిచినందున కేరళ ప్రభుత్వం చేసిన సూచనలు ఇవే :

• రాష్ట్రంలో బ్రెయిన్ ఫీవర్(Brain Fever) కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యలు అవసరం.
• నదుల్లో స్నానం చేసేటప్పుడు నీరు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి.
• మరిగించిన తాగునీటినే వాడాలి.
• భోజనం చేసేముందు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవి. పండ్లను తినేముందు వాటిని శుభ్రంగా కడగాలి.
• సరైన శుభ్రత లేని ఆహార పదార్ధాలను లేదా నిల్వ ఉంచినవాటిని తినవద్దు.
• ఫుడ్ స్టాల్స్, క్యాంటీన్లు, హోటళ్ళలోని ఆహార పదార్ధాల నాణ్యతను పరీక్షించడానికి హెల్త్ డిపార్టుమెంటుకు చెందిన ఫుడ్ సేఫ్టీ సిబ్బందిని నియమించాం.
• ఆహార వ్యర్థాలను నిర్దిష్ట డస్ట్ బిన్‌లలోనే పారవేయాలి.
• మల, మూత్ర విసర్జన కోసం టాయ్‌లెట్లను వినియోగించాలి. బహిరంగ మల, మూత్ర విసర్జన నిషేధం.
• శబరిమల ఆలయానికి వెళ్ళేందుకు నడిచి వెళ్ళాల్సి ఉన్నందున యాత్రకు ముందుగానే తేలికపాటి వ్యాయామాన్ని చేసి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి.
• ఎత్తయిన ప్రదేశానికి చేరుకోవాల్సి ఉన్నందున కాలి నడక మార్గాన్ని నెమ్మదిగా ఎక్కడంతో పాటు మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవాలి.
• ఏదేని పరిస్థితుల్లో అలసట, ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లుగా కనిపించినా, శారీరంగా నీరసంగా ఉన్నట్లు అనిపించినా వెంటనే హెల్త్ క్యాంపు సిబ్బంది నుంచి సాయాన్ని తీసుకోవాలి.
• అత్యవసరాలకు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ 04735-203232 నెంబర్‌ను సంప్రదించవచ్చు.
• ఎమర్జెన్సీ హెల్త్ అవసరాల కోసం పండలం దగ్గర కొయిక్కల్ దేవస్థానంలో డిస్పెన్సీరీ నుంచి సాయం తీసుకోవచ్చు. అడూర్, వడసేరిక్కర, పథనంతిట్ట ప్రాంతాల్లో 24 గంటలూ తెరిచి ఉంచేలా మెడికల్ షాపుల ఏర్పాటు.
• పంపా నది దగ్గర 24 గంటల కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
• పథనం‌తిట్ట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అత్యవసర కార్డియాలజీ సేవలు, క్యాథ్ ల్యాబ్ అందుబాటులో ఉన్నాయి.
• రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో డిఫిబ్రిలేటర్లు, వెంటిలేటర్లు, కార్డియాక్ మానిటర్లు, ల్యాబ్స్, ఆపరేషన్ థియేటర్లు సిద్ధంగా ఉన్నాయి.
• పంపా-సన్నిధానం మార్గంలో వైద్యులు, నర్సులు, హెల్త్ అసిస్టెంట్లు, ట్రెయిన్డ్ వాలంటీర్లు అందుబాటులో ఉంటారు.
• అటవీ మార్గమైనందున పాముకాట్లకు ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుని అన్ని ఆసత్రుల్లో యాంటీ-వీనమ్ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచాం.
• వేర్వేరు ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు, యాత్రికులు వస్తున్నందున ఇంగ్లిష్, హిందీ భాషలతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో సూచికలు, పోస్టర్ల ఏర్పాటు.

Read Also: బంగ్లా మాజీ ప్రధానికి మరణ దండన

Follow Us on : Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>