కలం, సినిమా : రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా వచ్చిన రామాయణ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లోంది. ఈ చిత్రం రిలీజైన ఎనిమిది రోజుల్లో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్ల మార్క్ (Ramayana Collections)దాటేసింది. వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన 11వ చిత్రంగా రామాయణ నిలిచింది.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా చూస్తే రూ. 675.05 కోట్ల గ్రాస్ రాబట్టడగా..రూ.564.60కోట్ల నికర వసూళ్లను దాటింది. ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ శాక్నిల్క్ ప్రకారం 8వ రోజు అన్ని భాషల్లో కలిపి రూ.53.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో రూ.358.50 కోట్లు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ.1,033.55కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
కేవలం ఎనిమిది రోజుల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూడో భారతీయ చిత్రంగా రామాయణ నిలిచింది. పుష్ప 2, ధురిందర్ – 2 ఏడు రోజుల్లోనే ఈ ఘనత సాధించాయి. ఇదే క్రమంలో బహుబలి – 2 (10 రోజులు), ఆర్ఆర్ఆర్ (16 రోజులు), జవాన్(18 రోజులు) లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల రికార్డులను అధిగమించింది.

