భారత్ సమ్మిట్‌ అడ్డుకునేలా కేంద్రం కుట్ర: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌(Bharat Summit)ను అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. దీనికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా సహకరిస్తోందన్నారు. విదేశీ మీడియా ప్రతినిధులు హైదరాబాద్ రాకుండా ఎయిర్‌పోర్టుల్లోనే అడ్డుకుంటోందని విమర్శించారు. 70 దేశాలకు చెందిన వెయ్యి మందిని ఇప్పటికే ఆహ్వానించామని.. వారిని ఎందుకు రానివ్వడం లేదని ప్రశ్నించారు.

భారత్ సమ్మిట్ దేశానికి వ్యతిరేకంగా జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఏం చేసినా కరెక్ట్.. కాంగ్రెస్ ఏం చేసినా తప్పేనన్నట్లు వారి ఆలోచనా ధోరణి ఉందన్నారు. గతంలో ప్రధాని, విపక్ష నేతల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేదని గుర్తు చేశారు. ప్రధాని మోదీ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.

పిలవని పేరంటానికి వెళ్లిన మోదీ..

రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఏదీ చేసినా వ్యతిరేకించడమే ప్రధాని మోదీ పనిగా పెట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ వచ్చి, విదేశీ ప్రతినిధులతో భేటీ అయితే తప్పేంటన్నారు. ఆయన దేశ ప్రతిపక్ష, కేబినెట్ హోదా కలిగిన నాయకుడు అన్నారు. ప్రధాని మోదీ పిలవని పేరంటానికి పాక్ ప్రధాని ఇంట్లో వేడుకకు వెళ్లొచ్చు కానీ, రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తే తప్పా..? అని మండిపడ్డారు. బీజేపీ రాహుల్‌ను గుడ్డిగా వ్యతిరేకించవద్దని సూచించారు.

ఢిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వచ్చారని, అప్పుడెందుకు తప్పుబట్టలేదని సీఎం రేవంత్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారనే భయం బీజేపీలో ఉందన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని చెప్పడానికి రాహుల్ వస్తున్నారని అన్నారు. రేపు రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రకటించే గిగ్ వర్కర్ పాలసీ దేశంలోనే ఉత్తమంగా నిలుస్తుందన్నారు. కిషన్ రెడ్డి, రాంచందర్ రావు తీరు రాష్ట్రానికి నష్టం చేస్తోందని, ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు.

Also Read : ‘రామాయణ’ సంచలనం.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>