Mobile Popup Ad
Mobile Popup Ad

29 ఏళ్లకే ఎమ్మెల్యే, మంత్రి.. చరిత్ర సృష్టించిన కీర్తన

కలం, వెబ్ డెస్క్: టీవీకే ఎమ్మెల్యే ఎస్.కీర్తన (Keerthana) చరిత్ర సృష్టించారు. ఒకేసారి మూడు రికార్డులు సొంతం చేసుకోబోతున్నారు. బాణసంచా తయారీ కేంద్రంగా దేశ వ్యాప్తంగా పేరొందిన శివకాశీ నియోజకవర్గం నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 29 ఏళ్లకే ఎన్నికై పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగపెట్టబోతున్నారు. ఇక, మరికాసేపట్లో మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసి.. టీవీకే ప్రభుత్వంలో తొలి మహిళా మంత్రిగా రికార్డు నెలకొల్పబోతున్నారు.

మొత్తం 9 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం..

టీవీకే ప్రభుత్వంలో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అసెంబ్లీలో బల నిరూపణ తరువాత.. మిత్రపక్షాలకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించబోతున్నారు.
1.ఎన్.ఆనంద్
2.ఆధవ్ అర్జున
3.డాక్టర్ కె.జి.అనునరాజ్
4.కె.ఏ.సెంగొట్టయన్
5.పి.వెంకట్రామన్
6.ఆర్.నిర్మల్ కుమార్
7.రాజ్ మోహన్
8, డాక్టర్ టీకే.ప్రభు
9.ఎస్.కీర్తన

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>