కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా తమిళ వెట్రి కళగం అధినేత సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు భారీగా తరలివస్తున్నారు.
ప్రముఖ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేడియానికి చేరుకున్న ఆమె విజయ్ కొత్త ప్రస్థానానికి తన మద్దతును తెలియజేశారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలకుమ ఆమె అభివాదం తెలుపుతూ సందడి చేశారు. మరికొద్ది సేపట్లో జరగనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవం కోసం తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు. స్టేడియం పరిసరాలు జనసంద్రంగా మారాయి. దళపతి విజయ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.

