కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో కొన్నాళ్లుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఆ రాష్ట్రంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ (TVK Chief Vijay) మరికాసేపట్లో ప్రమాణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా విజయ్ తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ, సినీ ప్రముఖులను విజయ్ ఆహ్వానించారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేరుకున్నారు. కాగా, సినీ నటి త్రిష, విజయ్ తల్లిదండ్రులతో సహా ప్రముఖులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మరికాసేపట్లో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

