Mobile Popup Ad
Mobile Popup Ad

సుప్రీం అంటే మీరేనా..? విచారణలో సిట్​ ప్రశ్నలివే..

కలం, వెబ్​ డెస్క్​ : ఫోన్​ ట్యాపింగ్ (Phone Tapping)​ వ్యవహారంలో భాగంగా నందినగర్​ లోని కేసీఆర్ (KCR)​ నివాసంలో విచారణలో సిట్​ పలు కీలక అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. నాలుగున్నర గంటలు కొనసాగిన కేసీఆర్ విచారణలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో సుప్రీం అంటే మీరేనా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అధికారుల పదవీకాలం ముగిసిన తర్వాత కూడా వాళ్లను ఎందుకు కొనసాగించారనే కోణంలోనూ విచారణ కొనసాగింది.

ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావుతో మీరు ఎప్పుడైనా నేరుగా మాట్లాడారా ?, ఒకవేళ మాట్లాడితే ఏ అంశాలపై మాట్లాడాల్సి వచ్చింది? అని కేసీఆర్​ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ డేటాను మీకు ఎవరు అందజేసేవాళ్లు?, ఎమ్యెల్యే కొనుగోలు సంబంధించిన వీడియోలు మీకు ఎవరి ద్వారా వచ్చాయి?, ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చారా? అంటూ నేరుగా ప్రశ్నించారు. ప్రభాకర్ రావు పదవీకాలం పొడిగింపు, ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టుల అప్పగింపుపైనా  కేసీఆర్ ను ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

ట్యాపింగ్ పరికరాలకు పార్టీ ఫండ్ వినియోగం, ఎలక్టోరల్ బాండ్స్, డోనర్ల నంబర్లు ట్యాపింగ్ లిస్ట్‌లో ఎందుకున్నాయని అడిగిన అధికారులు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారా? అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కొనుగోలు కేసు సమయంలో మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకు ఎలా తెలిసింది? అని కేసీఆర్​ ను సిట్​ ప్రశ్నించింది. పలు ఆధారాలను కేసీఆర్ ముందు ఉంచి, గతంలో సిటీ విచారణకు హాజరైన వారు ఇచ్చిన స్టేట్మెంట్ ముందు ఉంచి కెసిఆర్ (KCR) ను సిట్​ ప్రశ్నించింది.

Read Also: హిందువులపై దాడుల ఎఫెక్ట్​.. బంగ్లాదేశ్​కు సాయంలో కోత

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>